వారధి,మేరిల్యాండ్ రాష్ట్రములో ఉన్న తెలుగువారి కోసం ఏర్పరచిన లాభాపేక్షలేని తెలుగు సంస్థ. దక్షిణ భారత దేశంలోని ఆంధ్ర ప్రదేశ్ నుండి వలస వచ్చిన తెలుగువారందరు కలసి తమ తమ సంస్కృతి సాంప్రదాయాలను భావి తరాలవారికి అందించే ఉద్దేశ్యంతో 2013 ఫిబ్రవరి మాసంలో ఆవిష్కరించిన సంస్థ. ఎన్ని కాలాలు మారినా, తరాలు మారినా , మన భాష , సాహిత్యం, సంస్కృతి, సంప్రదాయాలు, సతతం కొత్త పుంతలు తొక్కుతూ, నిరంతర జీవనదిలా, సాగిపోతూ ఉంటాయి. మన చరితలోని చైతన్యాన్ని తీసుకొని, నవతరంగాల ఊపుతో ఎప్పుడూ భవితవైపు సాగే తెలుగు సంస్కృతియే భారతావనికి మూలం ఇదే మా వారధి వారి ప్రధాన లక్ష్యం.ఇందుకొరకు ప్రతి సంవత్సరం ఉగాది , దసరా మరియు దీపావళి పండుగల రూపంలో జరిపే సాంస్కృతిక కార్య క్రమాలు వారధి పట్టుగొమ్మలు.ప్రతి ఏటా సాహిత్య రంగంలోనూ సాంస్కృతిక రంగంలోనూ ప్రసిద్ధి చెందిన వారిచేత వివిధ కార్యక్రమాలు రూపొందించి ఇక్కడి తెలుగు ప్రజలకు మరింత చేరువై వా రి జీవితాల్లో వారధిని భాగస్వామిగ చేయడమే ఈ సంస్థ ఉన్నతాశయం.ఇక్కడి తెలుగు ప్రజల అవసరాల నిమిత్తం పిల్లలకు తెలుగు బడి తరగతులు నిర్వహించి వారికి తెలుగు నేర్పించడం,యువతను క్రీడల్లో ప్రొత్సహించడం అందులో భాగంగా వివిధ రకాల క్రీడల పోటీలు నిర్వహించడం మొదలైనవి వారధి అందిస్తున్న కార్యక్రమాలు.