మేరిల్యాండ్ , కొలంబియా : వారధి చరిత్రలో మరో కలికితురాయి Free Flu Clinic కార్యక్రమం. వారధి, American Diverity Group, Indian Origin Network of Howard
County or “I O N HoCo”,లతో సంయుక్తంగ ఇక్కడి ప్రవాస భారతీయుల కొరకు Rainbow center లో నిర్వహించిన ఈ “Free Flu Clinic” కార్యక్రమం విజయవంతం
అయింది. సుమారు 300 మంది ప్రవాస భారతీయులకు వివిధ వైద్య పరీక్షలు నిర్వహించడం, వారికి Flu mist ఇవ్వడం వంటి వాటిని సమర్థవంతంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి GUY J. GUZZONE Member of Senate since January 14, 2015, Dr. Clarence LAM, Democrat for State Delegate, CALVIN B.
BALL, Ed.D., Member, County Council (Democrat), శ్రీ Mayur Mody, Board Member of American Diveristy Group and శ్రీ ప్రవీణ్ ఫొన్నూరి ,the only
person of Indian Origin at an elected position in Howard County ముఖ్య అతిధులుగా విచ్చేశారు. వారధి ఆధ్వర్యంలో జరుగుతున్న ఇలాంటి సేవా కార్యక్రమాలను
గురించి వక్తలు అభినందనలు తెలియజేశారు.
ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించిన వారధి నిర్వాహకులను పలువురు కొనియాడారు. సమాజ సేవయే వారధి పరమావధిగా దూసుకెల్తున్న వారధి తన మూడవ
వసంతంలో ఎన్నో విలువైన సమాజ హిత కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం వాటిని సాధికారతతో సమర్థంగా నిర్వహించడం ముఖ్య విశేషం. ఈ కార్యక్రమంలో ముఖ్య భూమిక పొషించిన అధ్యక్షులు జగదీష్ గారిని, Community Services ప్రతినిధి చిన్నా గారిని పలువురు ప్రశంసించడం విశేషం. ఇంకా ఇందులో ఇతర ప్రతినిధులు,కార్య కర్తలు మరియు వారధి వ్యవస్థాపకులు పాల్గొన్నారు. Volunteersగా పాల్గొన్న విద్యార్థులకు ప్రశంశా పత్రాలు అందజేసిన పిమ్మట పసందైన Paradise Indian Cuisine,Gwyn oak ,MD’వారి భోజనం మరియు తేనీటి విందుతో ఈ కార్యక్రమం దిగ్విజయంగా ముగిసింది.